In a mega Cabinet Expansion, 43 leaders took oath as ministers in the Modi government 2.0 on Wednesday. Jyotiraditya Scindia, Pashupati Kumar Paras, Bhupender Yadav, Anupriya Patel, Shobha Karandlaje, Meenakshi Lekhi, Ajay Bhatt, Anurag Thakur among others have been included in the government. Meanwhile Union Minister for Law and Information Technology, Ravi Shankar Prasad has resigned from the Council of Ministers. Prakash Javadekar also resigned
#ModiCabinetexpansion
#Cabinetreshuffle
#CabinetMinisters
#ModiCabinet2
#PMModi
#43CabinetMinisterstookoath
#BJP
కేంద్ర కేబినెట్ విస్తరణ ముగిసింది. కొత్త మంత్రులుగా ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. ఈ సారి కేబినెట్ విస్తరణ ఒక్కింత ఆశ్చర్యానికి గురిచేసింది. మోదీ కేబినెట్‌లో కీలకంగా వ్యవహరించిన డాక్టర్ హర్షవర్ధన్, రమేష్ పోఖ్రియాల్, రవిశంకర్ ప్రసాద్, సంతోష్ గాంగ్వార్, ప్రకాష్ జవడేకర్‌లాంటి వారు కేబినెట్ నుంచి తప్పుకున్నారు. వీరి స్థానంలో కొత్త వారికి మోదీ అవకాశం ఇచ్చారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ సారి మోదీ జంబో కేబినెట్ యంగ్ గన్స్‌తో నిండి ఉంది. పలువురు కేంద్ర కేబినెట్‌లోకి ప్రమోషన్ పొందారు. వీరిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ఉన్నారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా 43 మందికి చోటు కల్పించారు. ఇందులో 15 మందికి కేంద్ర కేబినెట్ బెర్తులు దక్కగా... 28 మందికి కేంద్ర సహాయ మంత్రి పదవులు దక్కాయి.